లక్ష కోట్ల ఆస్తి సీక్రెట్ చెప్పవా కేసీఆర్ – సీఎం రేవంత్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి లెక్కలు వేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీకి పోయేది.. మాజీ సీఎం కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటును 7.25కి కుదించడానికే వెళ్లాలని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల చరిత్ర కూడా అందరికీ తెలియాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్లు అప్పు తెచ్చారన్నారు.
11.5 వడ్డీతో 14 ఏళ్లకు కేసీఆర్ అప్పు తెచ్చాడని.. యూబీఐ, నాబార్డు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టారన్నారు. అసలు, వడ్డీలు కలిపి ఇప్పటివరకు రూ.49,835 కోట్లు చెల్లించామని.. ఇంకా రూ.60,769 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.’నేను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడు. ఢిల్లీకి నేను ఎందుకు పోతున్నా. కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటు 7.25కి కుదించడం జరిగింది.
ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలకు బిగ్ బ్రదర్. జెండా అజెండా వేరు. కానీ ఆయన ప్రధాని.. మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి భేషజాలు ఎందుకు. ఇతర దేశాలకు ఎందుకు వెళుతున్నా.. పెట్టుబడి దారులను కలవడానికే. పరిశ్రమలు పెట్టండి అని అడిగితే తప్పేంటి?. ప్రధానిని కలిస్తే తప్పా?. 14 ఏళ్లు కట్టాల్సిన డబ్బులు.. 30 ఏళ్లు కడతా అని ఒప్పించుకున్నా. 13 వేల కోట్లు నాకు ఏడాదికి మిగులుతాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.