తప్పుల తడకగా ఓటర్ల జాబితా!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ లో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని స్థానిక మాజీ ఎంపీటీసీ -2 ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరోపించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు గాలికి వదిలి ఇష్టానుసారంగా వార్డులను గ్రామ పంచాయతీ సిబ్బంది తయారు చేశారని ఒగ్గు బాలరాజు యాదవ్ విమర్శించారు.గత 15 సంవత్సరాల నుండి ఉన్న వార్డులో ఓటు హక్కును మరో చోటికి మార్చి ఇష్టానుసారంగా వార్డులను విభజించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఉన్న ఓట్లు అన్ని అదే వార్డులో ఉండాలి కానీ తల్లిదండ్రులది ఒక వార్డులో కొడుకు,కోడలు ది ఇలా మరో వార్డులో ఓటు హక్కును నమోదు చేశారనీ బాలరాజు యాదవ్ అన్నారు. మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో 7346 మంది ఓటర్లు ఉన్నారనీ మొత్తం ఇష్టానుసారంగా వార్డులను విభజించారనీ ఒకసారి మీ మీ ఓట్లు ఏ వార్డులో ఉన్నాయో చూసుకోవాలని గ్రామ ప్రజలను ఆయన కోరారు.తప్పుల తడకగా ఓటర్ల జాబితా తయారీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కు మెయిల్ ద్వారా పిర్యాదు చేయడం జరిగిందనీ ఆయన అన్నారు. ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి సవరించాలన్నారు.
Related News
-
ఏడో తరగతి విద్యార్థినిపై ముస్లిం యువకుడు లైంగికదాడి..ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు!
-
తెలంగాణ టూరిజం బంపరాఫర్..తక్కువ ధరలోనే హైదరాబాద్–గోవా టూర్
-
సీఎం రేవంత్ రెడ్డికి విరాళమిచ్చిన మహేష్ బాబు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోలు చూడండి
-
వీడెవండీ బాబు: ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు..చివరికి
-
పాపులర్ జర్నలిస్ట్ మురళీధర్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
-
రష్యా మిలటరీలో నరకం..ఎట్టకేలకు ఇంటికి తెలంగాణ యువకుడు



