రష్యా మిలటరీలో నరకం..ఎట్టకేలకు ఇంటికి తెలంగాణ యువకుడు
తినడానికి తిండి సరిగ్గా ఉండదు..గడ్డకట్టే చలిలో గన్ పట్టి ఉక్రెయిన్ పై యుద్ధంలో పాల్గొనాలి..ప్రాణం మీద ఆశలు వదిలేసుకున్నాడు
22 ఏళ్ల వయస్సు..పెద్ద చదువులు చదవలేదు..సెక్యూరిటీ సంబంధిత జాబ్..అది కూడా రష్యాలో అని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మాడు. ఇక రష్యన్ లైఫ్ ఎలా ఉంటుందో అని కలలు కనడం మొదలుపెట్టాడు. రష్యా వెళ్లి బాగా సంపాదించి ఇంటికి పంపి కుటుంబానికి అండగా ఉండాలనుకున్నాడు.. ఎన్నో ఊహలతో గతేడాది నవంబర్ లో ఫ్లైట్ ఎక్కి రష్యాలో అడుగుపెట్టాడు. కట్ చేస్తే ఏ క్షణంలో ప్రాణాలు పోతాయో అని భయం భయంగా జీవితం గడపాల్సిన పరిస్థితి. తినడానికి తిండి సరిగ్గా ఉండదు..గడ్డకట్టే చలిలో గన్ పట్టి యుద్ధంలో పాల్గొనాలి..ప్రాణం మీద ఆశలు వదిలేసుకున్నాడు..కానీ మన మోదీ సర్కార్ మాత్రం అతడిని తిరిగి ఇంటికి సేఫ్ గా చేర్చేదాకా ప్రయత్నం ఆపలేదు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి తెలంగాణలోని తన ఇంటికి సేఫ్ గా తిరిగొచ్చాడు. తమ బిడ్డను చూసిన కుటుంబసభ్యుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తల్లి గర్భంలో 9 నెలలు ఉండి వచ్చినట్లు రష్యాలో 9 నెలలు గడిపి పునర్జన్మతో తమ బిడ్డ ఇంటికి చేరుకున్నాడని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
నారాయణ్ పేట్ కు చెందిన 22 ఏళ్ల మొహమ్మద్ సోఫియన్ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 2021లో దుబాయ్‌లో ఉద్యోగంలో చేరి, అక్కడే జీవనం కొనసాగించేవాడు. 2023లో ఒక ఏజెంట్‌తో సోఫియన్ కి పరిచయం ఏర్పడింది. రష్యా దేశంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉందని ఏజెంట్ చెప్పిన యామ మాటలు నమ్మిన సోఫియన్..గతేడాది నవంబర్‌లో రష్యా చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయానని తెలుసుకున్నాడు. తనలాగే చాలామంది భారతీయులు కూడా ఇలాగే మోసపోయారని గ్రహించాడు.
రష్యా లాంగ్వేజ్‌లో అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకాలు చేయించి అక్కడి సైన్యంలో చేర్పించాడు ఏజెంట్. మరికొందరితో పాటు సోఫియన్ ని కూడా రష్యా ఆర్మీ తమ దగ్గర పెట్టుకుంది. ఉక్రెయిన్ పై యుద్ధంలో పాల్గొనాలని రష్యా ఆర్మీ భారతీయ యువకులను బెదిరించేది..మాట వినకపోతే తిండి పెట్టకుండా గడ్డకట్టే చలిలో రాత్రంతా వదిలేయడం వంటి దారుణమైన పనిష్మెంట్లు ఇచ్చేది. దీంతో తప్పక యుద్ధంలోకి దిగాడు సోఫియన్. యుద్ధంలో ఎన్నోసార్లు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడాడు.
ఏజెంట్ చేతిలో తాను మోసపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు సోఫియన్. వారు ఈ విషయాన్ని విదేశాంగ శాఖ,భారత ఎంబసీల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ బందీల విడుదలపై రష్యా నాయకులను సంప్రదించారు. ఇవన్నీ ఫలించిన నేపథ్యంలో విడుదలైన సోఫియన్ విమానంలో శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సులో సొంతూరు నారాయణ్ పేట్ కి చేరుకున్నాడు. భారత్-రష్యాల ఒప్పందంలో భాగంగా సోఫియన్ సహా ఐదుగురు భారతీయులను విడుదల చేశారు.
Related News
-
ఏడో తరగతి విద్యార్థినిపై ముస్లిం యువకుడు లైంగికదాడి..ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు!
-
తెలంగాణ టూరిజం బంపరాఫర్..తక్కువ ధరలోనే హైదరాబాద్–గోవా టూర్
-
సీఎం రేవంత్ రెడ్డికి విరాళమిచ్చిన మహేష్ బాబు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోలు చూడండి
-
వీడెవండీ బాబు: ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు..చివరికి
-
పాపులర్ జర్నలిస్ట్ మురళీధర్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
-
తప్పుల తడకగా ఓటర్ల జాబితా!



