ప్రతీ శనివారం ట్రైన్ .. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు : రూ.10 వేలతో ఎల్లోరాకు వెళ్లొద్దామా!
చూపు తిప్పుకోనివ్వని అందాలు అజంతా, ఎల్లోరా గుహల సొంతం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేసే ప్రాంతం అది.
చూపు తిప్పుకోనివ్వని అందాలు అజంతా, ఎల్లోరా గుహల సొంతం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేసే ప్రాంతం అది. జీవితంలో ఒక్కసారైనా ఆ శిల్పసౌందర్యాన్ని చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. అనువైన బడ్జెట్లోనే ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఎల్లోరా గుహలు మాత్రమే కాక, ఔరంగాబాద్, నాసిక్, షిర్డీలను కూడా ఈ ప్యాకేజీలో సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీ పేరు మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్ హైదరాబాద్. ఇది మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉంటుంది. విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లి రావొచ్చు. రూ.20 వేల 950 నుంచి ప్యాకేజీ రేట్లు మొదలవుతాయి. ఐఆర్సీటీసీ మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ఇదే.
మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాచిగూడ, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. యాత్ర ముగించుకున్నాక కాచిగూడలో రైలు దిగాల్సి ఉంటుంది. టికెట్ ధర రూ.7,400 నుంచి ప్రారంభమవుతుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతీ శనివారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 6, 13, 20, 27 ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ట్రైన్ జర్నీ..
మొదటి రోజు సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ (అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 17064) నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
రెండోరోజు ఉదయం 4:40 గంటలకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ చేరుతారు. అక్కడ ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పాహారం స్వీకరించాక ఎల్లోరా అందాలను చూసేందుకు బయల్దేరుతారు. తర్వాత ఘృశ్నేశ్వర ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఇక సాయంత్రం బీబీ కా మక్బారాను వీక్షిస్తారు. ఆ రాత్రి బస అక్కడే.
మూడో రోజు టిఫిన్ తర్వాత అజంతా గుహల్ని చూసేందుకు బయల్దేరుతారు. వాటిని వీక్షించాక సాయంత్రం ఔరంగాబాద్ చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు (ట్రైన్ నం: 17063) రైలు ఎక్కుతారు.
నాలుగో రోజు ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరడంతో మీ ప్రయాణం ముగుస్తుంది.
ఛార్జీలు ఇలా..
బుక్ చేసుకునే వ్యక్తుల సంఖ్యను బట్టి ప్యాకేజీ ఛార్జీల్లో మార్పు ఉంటుంది. ఒకరు నుంచి ముగ్గురు వ్యక్తులు బుక్ చేసుకుంటే కంఫర్ట్‌లో (థర్డ్ ఏసీ బెర్త్) ఒక్కో ప్రయాణికుడికి రూమ్ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.22,920, ట్విన్ షేరింగ్‌కు రూ.12,650, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,050 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.8,630, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,890గా నిర్ణయించారు. స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్) రూమ్ సింగిల్ షేరింగ్ అయితే రూ.21,440, ట్విన్ షేరింగ్‌కు రూ.11,170, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8,570. ఇక 5- నుంచి11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.7,150, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.5,410 చెల్లించాలి. నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కలిసి బుక్ చేసుకుంటే కంఫర్ట్‌లో (థర్డ్ ఏసీ) డబుల్ షేరింగ్‌కు రూ.9,930, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8,880 చెల్లించాలి. 5 నుంచి-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 8,630, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,890 వెచ్చించాలి. అదే స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్) డబుల్ షేరింగ్‌కు రూ.8,440, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,400 చెల్లించాలి. 5 నుంచి-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.7,150, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 5,410 చెల్లించాలి.



