Holyday News: నెలలో రెండో శనివారం మాత్రమే సెలవు ఎందుకు ఇస్తారో తెలుసా?

సాధారణంగా హాలిడే అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆదివారం. ఆరోజున స్కూల్స్ కు, ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంక్స్ కు సెలవు ఉంటుంది. ఈ ఆనవాయితీ చాలా కాలంగా అమలులో ఉంది. ఆదివారం కాకుండా పండుగల సమయంలో కూడా సెలవు ఉంటుంది. ఇవే కాకుండా, ప్రతీ నెలలో రెండవ శనివారాన్ని కూడా హాలీడే గా ఉంటుంది. దానికి కారణం ఏంటని చాలా మందికి అనుమానం వచ్చే ఉంటుంది. కానీ, సమాధానం తెలియదు. మరి రెండవ శనివారం హాలిడే ఎందుకు ప్రకటించారు, దానికి వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రెండో శనివారం సెలవు ఎందుకు?
పూర్వం 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి అతనికి ఒక సహాయకుడు ఉండేవారు. ఆ సహాయకుడు తన తల్లిదండ్రులను కలిసేందుకు సెలవుదినాల్లో తన ఇంటికి వెళ్ళేవాడు. దాంతో.. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీలు ఉండేది కాదు. కొన్నిసార్లు అదికూడా సాధ్యం కాకపోవడంతో వాళ్ళే అతని వద్దకు వచ్చేవారు. అది గమనించిన బ్రిటిష్ అధికారి ఆ సహాయకుడికి ప్రతీ నెల రెండో శనివారం సెలవును ప్రకటించాడు. ఆ తరువాత.. ఆరోజును అందరికీ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. అలా ప్రతీ శనివారం సెలవు దినంగా ప్రచుర్యంలోకి వచ్చింది.
ఆదివారం సెలవు ఎలా వచ్చింది?
ఇక ఆదివారం సెలవు రావడం వెనుక కూడా పెద్ద కథే ఉంది. క్రైస్తవ మతం ప్రకారం.. దేవుడు 6 రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ పనులతో అలసిపోయిన దేవుడు ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. అందుకే.. ఆదివారం అనేది క్రైస్తవులకు ప్రత్యేక దినంగా మారింది. క్రైస్తవ మతాన్ని అనుసరించిన బ్రిటిష్ వారు ప్రపంచంలోని అన్ని దేశాలను పాలించారు కాబట్టి.. అన్ని చోట్లా ఆదివారం సెలవు అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఇక 1843 నుండి భారతదేశంలో కూడా ఆదివారం సెలవుదినంగా మారింది.