వేములవాడ ఆలయం మూసివేత

పల్లవి, వెబ్ డెస్క్ : వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. నిత్యం ఈ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే రాజన్న ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే?.. ఈనెల 7న చంద్ర గ్రహణం ఏర్పడనుంది.
ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నట్లు ఆలయం ఆధికారులు తెలిపారు. ఈనెల 7వ తేది ఆదివారం ఉదయం 11.25 గంటల నుంచి 8వ తేది సోమవారం ఉదయం తెల్లవారు జామున ఉదయం 3.45 గంటల వరకు ఆలయ మూసివేయనున్నట్లు వెల్లడించారు.
గ్రహణం అనంతరం ఈనెల ఎనిమిదో తారీఖున ఉదయం 4 గంలకు ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజులపాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను సైతం ఆలయ అధికారులు రద్దు చేశారు .
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు