14ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసు తుది తీర్పు..!

పల్లవి, వెబ్ డెస్క్ : అప్పటి ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్ , వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది.
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం లను నిర్దోషులుగా ప్రకటించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై పదహారు ఏండ్ల కిందట 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2022లో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది.