ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా…

పల్లవి, వెబ్ డెస్క్ :ఏపీ అధికార టీడీపీకి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తనపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు. శనివారం నంద్యాలలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ మాట్లాడుతూ వైసీపీ నేతలు పనికట్టుకోని అసత్య ప్రచారం చేస్తున్నారు.
బీట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారు. నేను తప్పుడు పనులు చేశానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అహోబిలంలో సత్రాలు, హోటళ్లు నిర్మిస్తున్నారు. అందులో నేను వసూళ్లకు పాల్పడుతున్నాను. నేనే అనుమతులు ఇచ్చాను అని అరోపణలు చేస్తున్నారు.
ఆ గ్రామ పంచాయితీ సర్పంచ్ వైసీపీ నేత అని వాళ్లు మరిచిపోయారు. ఓ గ్రామంలో కట్టడాలు. నిర్మాణాలు చేపట్టాలంటే అక్కడ సర్పంచ్ అనుమతివ్వాలి. ఆ గ్రామ ప్రజల తీర్మానం అవసరం. ఇంతటి చిన్న లాజిక్ వైసీపీ నేతలు మరిచిపోయి అవాక్కులు.. చవాక్కులు పేలుస్తున్నారు. దమ్ముంటే నిరూపించాలి. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తాను . నిరూపించకపోతే వైసీపీ నేతలు తప్పు అయిందని ముక్కును నేలకు రాయాలని ఆమె అన్నారు.