బంగారం కొనేవాళ్లకు శుభవార్త…!

బంగారం కొనాలనుకునేవాళ్లకు ఇది ఖచ్చితంగా శుభవార్త. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అక్షత తృతీయ సందర్భంగా సహాజంగా బంగారం ధరలు ఎక్కడైన పెరుగుతాయి.
కానీ దీనికి భిన్నంగా ఈరోజు ధరలు తగ్గాయి. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ. అరవై రూపాయలు తగ్గి తొంబై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలకు చేరింది.
మరోవైపు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర రూ యాబై తగ్గి ఎనబై తొమ్మిది వేల ఏడు వందల యాబై రూపాయలకు చేరింది. అటు వెండి ధర కూడా రెండు వేలు తగ్గింది. దీంతో ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలుగా వెండి ధర పలుకుతుంది.