భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
పల్లవి, హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 2600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. 24,300 దిగువన ఖాతా తెరిచిన నిఫ్టీ.. ఓ దశలో 24 వేల స్థాయిని కోల్పోయింది. ఆఖర్లో కాస్త కోలుకుని 24 వేల ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 78,588.19 పాయింట్ల వద్ద పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,295 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 2,222.55 పాయింట్ల నష్టంతో 78,759.40 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 662 పాయింట్ల నష్టంతో 24,055 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లలో కుదుపు కారణంగా రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది. హెచ్యూఎల్, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగడం గమనార్హం.



