హారతి కర్పూరంలా కరిగిపోయిన అదానీ సంపద
గౌతమ్ అదానీపై న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి
గౌతమ్ అదానీపై న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో 11 కంపెనీల స్టాక్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్లు తగ్గి $59.3 బిలియన్లకు చేరుకుంది.
అదానీ చేశారన్న రూ.2000 కోట్ల స్కామ్ కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల మెడకే చుట్టుకొనేలా ఉంది. తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని అదానీ+అజూర్ పవర్ కంపెనీలు 2021-22 మధ్య 4 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే $256M లంచాలుగా ఇచ్చారని NYC కోర్టు ఆరోపిస్తోంది. అప్పుడు ఛత్తీస్‌గఢ్ (INC), తమిళనాడు (DMK), ఏపీ (YCP), ఒడిశా (BJD) BJP పాలిత రాష్ట్రాలు కావు. ఇప్పుడిదే కీలకంగా మారింది.
అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్‌ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.



