లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పల్లవి, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో బుధవారం భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు లాభపడి 82,726 వద్ద సెటిలైంది.
నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 25,219 వద్ద స్థిరంగా ఉంది. టాటా మోటార్స్ , శ్రీరామ్ ఫైనాన్స్ , ఎయిర్టెల్, అపోలో, బజాజ్ ఫైనాన్స్ , మారుతీ సుజుకి, ఐసీఐసీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ , ఆల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.