ICICI క్రెడిట్ కార్డు కొత్త రూల్స్.. లేట్ ఛార్జీల ఫైన్ రూ.1300
ICICI : ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ కార్డు తన క్రెడిట్ కార్డ్ రుసుములను మార్చుతున్నట్లు వెల్లడించింది. కొత్త ఛార్జీలు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది.
ICICI : ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ కార్డు తన క్రెడిట్ కార్డ్ రుసుములను మార్చుతున్నట్లు వెల్లడించింది. కొత్త ఛార్జీలు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. ముఖ్యంగా లాంజ్ యాక్సెస్ కోసం వెచ్చించాల్సిన అమౌంట్ పెంచుతూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అదనంగా చెల్లించాల్సి వస్తుంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్రెస్ కోసం తొలి త్రైమాసికంలో రూ.75 వేల వరకు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పూర్తి చేయాలి. అంతకు ముందు ఇది రూ.35 వేలుగా ఉండేది. దానికి ముందు రూ.5 వేలు మాత్రమే ఉండేది. గడిచిన 6 నెలల కాలంలోనే భారీగా పెంచేసింది.
క్రెడిట్ కార్డులు వినియోగించే వారు బిల్లులను సకాలంలో చెల్లించకుంటే లేట్ పేమెంట్ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రూల్స్ ప్రకారం ఇక నుంచి రూ.100 వరకు బిల్ ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ, రూ.101 నుంచి రూ.500 వరకు బిల్ అయితే రూ.100 లేట్ పేమెంట్ ఛార్జీ ఉంటుంది. రూ.501-రూ.1000 వరకు అయితే రూ.500 కట్టాలి. రూ.1001 నుంచి రూ.5 వేల వరకు అయితే రూ.600, రూ.5001 నుంచి రూ.10 వేల వరకు బిల్ ఉంటే రూ.750, రూ.10001 నుంచి రూ.25 వేల బిల్లుపై రూ.900, రూ.25,001 నుంచి రూ.50 వేల బిల్లుపై లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1100గా ఉన్నాయి.
రూబిక్స్, సఫిరో, ఎమరాల్డ్ కార్డ్లు యుటిలిటీ చెల్లింపులు, రూ. 80,000 వరకు నెలవారీ ఖర్చులు ఉంటాయి. ఈ పరిమితి వరకు బీమా చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందించడం కొనసాగిస్తుంది. ఇది కాకుండా ఇతర కార్డులకు ఈ పరిమితి రూ. 40 వేలు. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ రూబిక్స్ వీసా, సఫిరో వీసా, ఎమరాల్డ్ వీసా కార్డ్ హోల్డర్లు నెలవారీ కిరాణా ఖర్చు రూ. 40,000 వరకు రివార్డ్ పాయింట్లను పొందగలరు. మిగిలిన వారికి ఈ పరిమితి రూ.20 వేలుగా ఉంది.



