PM Modi in kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదం చివరి శ్వాస..మోదీతో అట్లుంటది మరి
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జ.రుగనున్న జమ్మూకశ్మీర్ లో శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. జమ్మూ ప్రాంతంలో భద్రత పరంగా సున్నితమైన ఏరియా అయిన దోడా జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు మద్దుతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. గత 42 ఏళ్లలో ఓ భారత ప్రధాని దోడాలో పర్యటించడం ఇదే తొలిసారి. దోడా ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ..జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోందన్నారు.
జమ్ముకశ్మీర్ లాంటి అందమైన ప్రాంతాన్ని వారసత్వ రాజకీయాలు దెబ్బతీశాయననారు. అందుకే పరివారవాదుల రాజకీయాలను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించిందన్నారు మోదీ. దాదాపు 2000 సంవత్సరం నుంచి జమ్ముకశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలు జరగలేదని… కొత్త నేతలకు అవకాశం రాలేదని… అందుకే కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని తాను ప్రయత్నించానని.. తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని.. ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి చేర్చడమే ఈ ఎన్నికల అసలు లక్ష్యమని మోదీ అన్నారు.
జమ్ముకశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూలు ఇకపై ఉండవని, ఆ రోజులు ముగిసిపోయాయన్నారు. శ్రీనగర్ నడిబోడ్డున ఉన్న లాల్ చౌక్ దగ్గరకు వెళ్లాలంటే కూడా ప్రజలు గతంలో భయపడేవారని.. కాంగ్రెస్ హయాంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉండిందని మోదీ గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుతం రాళ్లదాడులు లేవని,గతంలో ఉగ్రమూకలు విసిరిన రాళ్లు కొత్త జమ్ముకశ్మీర్ ను సృష్టించడానికి ఉపయోగించామన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు జమ్ముకశ్మీర్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, ఇప్పటివరకు కశ్మీరీలు విశ్వసించిన రాజకీయ పార్టీలు వారి పిల్లల భవిష్యత్తును పట్టించుకోలేదని… వారు వారి వారసుల భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాయని మోదీ విమర్శించారు.
కాగా,జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశలో భాగంగా పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు…సెప్టెంబర్ 25న రెండో దశలో గందర్బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లోని 26 స్థానాలకు… అక్టోబరు 1న చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లోని 40 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.



