ఘనుడే : ఫస్ట్ నైట్ తరువాత డబ్బులతో పరార్.. ఏకంగా 25 పెళ్లిళ్లు
పెళ్లి చేసుకుంటాడు… ఆ తర్వాత ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండి.. ఆ తరువాత వధువు వద్ద ఉన్న నగలు, నగదు తీసుకుని పారిపోతాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా25 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలనే టార్గెట్ చేస్తూ 26వ పెళ్లికి సిద్ధమవుతున్న ఈ నిత్యపెళ్లికొడుకును మహారాష్ట్రలోని పాల్గర్లో పట్టుకున్నారు పోలీసులు.
26వ పెళ్లికి సిద్ధమవుతున్న ఈ నిత్యపెళ్లికొడుకు పేరు ఫిరోజ్ షేక్. అన్వర్, రెహ్మాన్, రహీమ్, సురేష్ , రమేష్ ఇలా ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆరుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు మనోడు. అయినప్పటికీ బుద్ది మారలేదు. పెళ్ళి మీద పెళ్లి చేసుకోవడం మాత్రం మానలేదు. ఊరు, పేరు మార్చుకుని అమ్మాయిలకు వల విసిరేవాడు.
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలనే టార్గెట్ చేస్తూ వారితో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుని తర్వాత కొన్ని రోజులకు పారిపోయేవాడు. పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసిన ఫిరోజ్ ఖాన్ వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల నగదు, అమ్మాయిల ఏటీఎంలు, పాస్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 26వ పెళ్లికి సిద్ధమవుతున్న ఇతనిపై ఇప్పటికే15 మందికి పైగా మహిళలు ఫిర్యాదు చేశారు.
Related News
-
సీఎం పడ్నవీస్ సతీమణి డ్రస్ పై సోషల్ మీడియాలో చర్చ
-
గోదావరి ఉప నదులు ఎన్నో తెలుసా..?
-
మహిళా మంత్రికి వేధింపులు..!
-
Murlidhar Mohol : మహారాష్ట్ర సీఎం… తెరపైకి కొత్త వ్యక్తి పేరు!
-
Mallikarjun Kharge : అందుకే ఓడిపోయాం.. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి : ఖర్గే కీలక వ్యాఖ్యలు
-
Eknath Shinde : చెప్పులరిగేలా తిరిగా.. సీఎం ఎంపికపై షిండే సంచలన కామెంట్స్



