గోదావరి ఉప నదులు ఎన్నో తెలుసా..?

పల్లవి, వెబ్ డెస్క్: గోదావరి నదిలో ఏడాదిపొడవునా నీళ్లు ఉంటాయంటారు. అలాంటి జీవనదికి ఎన్ని ఉప నదులు ఉన్నాయో తెలుసా..?. మహారాష్ట్రలో జన్మించిన గోదావరి నది ఏపీలోని అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. గోదావరి నది పొడవు మొత్తం 1,465 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
గోదావరి నదికి ప్రవర, పూర్ణ, మంజీర, కడెం, మానేరు, ప్రాణహిత (పెన్ గంగ, వైన్ గంగ, వార్ధా) , ఇంద్రావతి, శబరి,కిన్నెరసాని ముఖ్యమైన ఉపనదులుగా ఉన్నాయి. గోదావరికి ముప్పై నాలుగు శాతం నీరు ప్రాణహిత నుంచే వస్తుంది. గోదావరి, ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ ఉంటుంది. ఆ తర్వాతనే ఇంద్రావతి, శబరి నదులు కలిశాక పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.