Murlidhar Mohol : మహారాష్ట్ర సీఎం… తెరపైకి కొత్త వ్యక్తి పేరు!
Murlidhar Mohol : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతున్న సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది. సీఎం ఎవరనేదానిపై క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతుంది.
Murlidhar Mohol : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతున్న సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది. సీఎం ఎవరనేదానిపై క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ముగ్గురూ సీఎం పదవిపై కన్నేశారు.
అయితే కూటమిలో ఎక్కువగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో బీజేపీకే సీఎం పీఠం దక్కుతుందని, దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపుగా సీఎం అవ్వడం ఖాయమంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులోకి మరో కొత్త వ్యక్తి పేరు వచ్చింది. ఆయనే మురళీధర్ మోహోల్. ఈయన ప్రస్తుతం పుణే నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయక మంత్రిగా ఉన్నారు.
ఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను కాకుండా మురళీధర్ మోహోల్ ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ హైకమాండ్ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మురళీధర్ మోహోల్ స్పందిస్తూ.. సీఎం రేసులో తన పేరు ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా కల్పితమని పేర్కొంటూ పోస్టు పెట్టారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంచ బీజేపీ పార్లమెంటరీ బోర్డు తేలుస్తుందని, సోషల్ మీడియా కాదని వివరణ ఇచ్చారు.
కాగా ఇటీవల వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 132 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన (షిండే వర్గం) 57 స్థానాల్లో గెలిచింది, ఎన్సీపీ 41 చోట్ల గెలుపొందింది.



