మహిళా మంత్రికి వేధింపులు..!

మహారాష్ట్ర క్యాబినెట్ మహిళా మంత్రి పంకజా ముండేను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పూణేకు చెందిన నిందితుడు మంత్రి పంకజా ముండే కి తరచూ కాల్స్ చేసేవాడు.
చాలా అసభ్యకరంగా మెసేజ్ లు పంపేవాడు. దీంతో బీజేపీ సోషల్ మీడియా పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. విచారణ చేపట్టి తాజాగా పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.