గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ భార్య.. లాస్ట్ లో ట్విస్ట్
తొమ్మిది నెలల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య తిరిగి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్‌జీత్‌కుమార్ ప్రస్తుతం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నాడు.
ఈయన భార్య సూర్య జైకు కొంతకాలం కింద తమిళనాడుకుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి తొమ్మిది నెలల క్రితం పారిపోయారు. సూర్య జై ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది. 2024 జులై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటనే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటినుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ క్రమంలో తన భర్త రణ్‌జీత్‌కుమార్ ఇంటికి వచ్చింది సూర్య జై. కానీ ఆయన ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. రంజీత్ కుమార్ తరఫు న్యాయవాది హితేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ జంట 2023లో విడిపోయారని, విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా సూర్య జై మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె భర్త నిరాకరించాడు.



