స్మితా సబర్వాల్ కు మద్ధతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే…..!
తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారిణీ అయిన స్మితా సబర్వాల్ కు ఇటీవల గచ్చిబౌలి భూముల వివాదంలో రీట్వీట్ చేశారని నోటీసులు జారీ అయిన సంగతి తెల్సిందే. ఏఐ ఫోటోలను రీట్వీట్ చేశారని ఐఏఎస్ అధికారిణీ స్మితా సబర్వాల్ ను విచారణకు హజరు కావాలని పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ అంశంపై ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ” కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ అధికారిణీ స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ లో ఎలాంటి తప్పు లేదు.
ఆ ట్వీట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని నేను భావించడం లేదు. స్మితా సబర్వాల్ తన కేరీర్ మొత్తంలో ఎలాంటి మచ్చ లేకుండా పని చేశారు. అలాంటి అధికారిణీకి నోటీసులు అందించడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యానించారు.



