మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబానికి ప్రధాని మోదీ పరామర్శ
పల్లవి, వెబ్ డెస్క్ : నిన్న గురువారం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ పరామర్శించారు.
‘విజయ్ భాయ్ మన మధ్య లేరనేది ఊహించలేనిది. నాకు ఆయన చాలా ఏళ్లుగా తెలుసు. కలిసి పనిచేశాం. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లోనూ ఆయన కష్టపడి పనిచేసేవారు.
పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వర్తించి, గుజరాత్ సీఎం గా సేవలందించారు’ అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు.



