షాకింగ్ న్యూస్.. కంగువా సినిమాను కట్ చేశారు
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. పీరియాడికల్ డ్రామాగా ఎమోషనల్ కంటెంట్ తో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. పీరియాడికల్ డ్రామాగా ఎమోషనల్ కంటెంట్ తో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ప్రేక్షకుల నుండి మాత్రం ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ వచ్చింది. విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవల్లో ఉన్నప్పటికీ కథ, కథనం ప్రకారం దర్శకుడు ఫెయిల్ అయ్యారు అంటూ కామెంట్స్ వినిపించాయి. అంతేకాదు.. సినిమా డ్యూరేషన్ విషయంలో కూడా ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు.
దాంతో కంగువా మేకర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే.. దాదాపు 12 నిమిషాల నిడివి ఉన్న సీన్స్ ను సినిమా నుండి కట్ చేశారట. ప్రెజెంట్ ఈ సినిమా నిడివి 2:22 నిమిషాలుగా సెట్ చేశారట. కనీసం బోర్ ఫీల్ అవకుండా ఈ డెసిషన్ మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ట్రిమ్ చేసిన తరువాత అయినా సినిమాకు కలెక్షన్స్ పెరుగుతాయా అనేది చూడాలి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.160 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇదే కంటిన్యూ అయితే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడం ఖాయం. మరి లెంత్ తగ్గించడం అనేది ఏమైనా ప్లస్ పాయింట్ గా మారుతుందా అనేది చూడాలి.



