ఏ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ ప్రభావం చూపుతుంది..?

పల్లవి, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు షాకిస్తూ ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా టారిఫ్ ట్యాక్స్ వేస్తూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటికే ఉన్న 25% టారిఫ్ ట్యాక్స్ తో పాటుగా మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ ట్యాక్స్ విధిస్తూ ఎగ్జిక్యూట్ ఫైల్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా విధించిన ప్రస్తుత టారిఫ్ ట్యాక్స్ ఏ ఏ వస్తువుల ఎగుమతులపై ప్రభావితం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సేంద్రీయ రసాయనాలపై 54 శాతం,కార్పెట్లపై 52.9 శాతం,బట్టలపై 63.9 శాతం,నేసిన వస్త్రాలపై 60.3 శాతం,టెక్స్‌టైల్స్, మేడ్ అప్‌లపై 59 శాతం,వజ్రాలు, బంగారానికి చెందిన ఉత్పత్తులపై 52.1 శాతం,యంత్రాలు, మెకానికల్ పరికరాలపై 51.3 శాతం,ఫర్నిచర్, బెడింగ్, మ్యాట్రెస్లు పై 52.3 శాతం,స్టీల్, అల్యూమినియం, కాపర్ వస్తువులపై 51.7 శాతం,వాహనాలు, విడిభాగాలపై 26 శాతం సుంకం అమెరికా విధించింది.
అయితే అత్యధికంగా భారతీయ బట్టల ఎగుమతులపై 63.9 శాతం సుంకాలు చెల్లించాల్సి రావడం గమనార్హం.పెట్రోలియ ఉత్పత్తులపై 6.9 శాతం మాత్రమే అమెరికా సుంకాలు విధించింది.తాజాగా పెంచిన సుంకాలు భారతదేశపు ఎగుమతుల ఆదాయ వనరులపై ఎక్కువ ప్రభావం చూపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.