వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి , మరో కీలక నేత సతీష్ రెడ్డిలపై రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాలోని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందుల పీఎస్ లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నేత సతీష్ రెడ్డిలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది టీడీపీకి చెందిన స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు.పులివెందులలో నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి తెలుగుదేశం వైసీపీ శ్రేణులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.
టీడీపీకి చెందిన నలుగురు నేతలతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన ఇద్దరు నేతలతో పాటు మరికొందరిపై పులివెందుల పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.



