కేసీఆర్ కు హైకోర్టు షాక్…!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టీస్ పీసీ ఘోష్ కమిటీ నేతృత్వంలోని కాళేశ్వరం కమీషన్ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ జరపాలని కేసీఆర్, హారీశ్ రావు తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా , ఈ కేసుజు సీబీఐ కు అప్పగించకుండా ఆదేశించాలని వారు కోరారు.
కానీ దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.



