సూర్య కొత్త మూవీ ‘రెట్రో’.. టీజర్ అదిరింది
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇటీవలే కంగువా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఇటీవలే కంగువా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత సూర్య డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో పూజ హగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు రెట్రో అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. టీజర్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.



