బుట్టబొమ్మ ‘ పూజా’ కు భారీ షాక్.!
పల్లవి, వెబ్ డెస్క్ : పూజా హెగ్డే అంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని వరుస సినిమాలతో పాటు సూపర్ డూప హిట్లతో ఒక ఊపు ఊపిన అందమైన బుట్టబొమ్మ. ఇటు అందంతో పాటు అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు యువతరం మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు కాలం కలిసి రావడం లేదు. ఒక పక్క చేసిన సినిమాలు హిట్ కాక, మరోవైపు సెలెక్ట్ అయిన చిత్రాల నుంచి ఈ హాట్ బ్యూటీని తప్పిస్తున్నారు. దానికి కారణం గత కొంతకాలంగా తాను హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ ప్లాప్ లు అవ్వడం .
దీని కారణంగానే ఈ ముద్దుగుమ్మ దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్ మిస్ అయినట్లు టీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కుబేర మూవీతో ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులను అటు కోలీవుడ్ సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన సీనియర్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో ఈ ముద్దుగుమ్మను తీసుకోవాలని ఈ చిత్రం యూనిట్ భావించిందంట. ఏమైందో ఏమో అమ్మడు గత చరిత్రను చూసో కానీ కారణం ఏదైనా కానీ పూజాను కాదని మలయాళ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇటీవల పూజా హెగ్డే నటించిన రాథే శ్యామ్, బీస్ట్, ఆచార్య నుంచి రెట్రో వరకు నటించిన భారీ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొల్తా పడటంతో ఆమె క్రేజ్ తగ్గింది. ఈ నేపథ్యంలోనే తాజా ధనుష్ హీరోగా విగ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ కొత్త సినిమాలో ఈ బుట్టబొమ్మను కాదని మలయాళ బొమ్మను తీసుకున్నారని టాక్. ఏది ఏమైన సినిమా హిట్ అయితే తప్పా ప్లాప్ అయితే సినిమాల్లో అవకాశాలు చేతికి అందివచ్చి చేజారిపోతాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. అందుకే కథలను పాత్రలను సరిగ్గా అంచనా వేసి ఎంచుకోవాలని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.



