ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది.

డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ బాలకృష్ణతో అఖండ మూవీ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అఖండ 2లో కూడా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా బాలయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
“బాలయ్య ఒక లెజెండ్, ఓ పాజిటీవ్ ఎనర్జీ. ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన అందరినీ ఒకేలా చూస్తారు. పాత్రకు తగ్గట్టుగా యాక్టర్లను సెలెక్ట్ చేస్తారు తప్ప వయస్సు చూసి కాదు. అందుకే ఆయనతో సినిమా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మరోసారి అఖండ 2లో ఆయనతో కలిసి చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది ప్రగ్యా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.