తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల పంట.

పల్లవి, వెబ్ డెస్క్ : శుక్రవారం కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్దుల్లో ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాను వరించాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమా అవార్డును దక్కించుకుంది.
మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం హనుమాన్. ఈ మూవీ మైథలాజికల్ సోషియో ఫాంటసీగా తెరకెక్కగా ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా హనుమాన్ మూవీకే దక్కడం విశేషం.
మరోదర్శకుడు సాయిరాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య జంటగా నటించగా రూపొందిన మూవీ బేబీ. ఈ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సింగింగ్ అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా ఈ సినిమా దర్శకుడైన సాయిరాజేష్ కు దక్కింది. ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ ఎంపికయ్యారు. ఉత్తమ బాలనటి కేటగిరిలో మాత్రం ‘గాంధీతాత చెట్టు’ సినిమాలో కీ రోల్ పోషించిన సుకృతివేణి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డుకు ఎంపికైంది.