అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి..

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కొన్ని వేల మందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రి సేవలను పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గుర్తించాయి. తాజాగా ఈ సేవలను అమరావతిలో అందించేందుకు సిద్ధమవుతున్నారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం.
అందులో భాగంగా ఈ నెల ఆగస్టు పదమూడో తారీఖున అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు , సీఎం నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేస్తారని ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ తో ఎమ్మెల్యే బాలకృష్ణ కలిసి పరిశీలించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మిస్తున్నాం, మొత్తం 3 దశల్లో పూర్తిచేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు.