DK Shivakumar : ఫ్రీ బస్సు స్కీమ్‌ను ఎత్తేసే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం!
DK Shivakumar : కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న ఫ్రీ బస్సు స్కీమ్ శక్తి పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలోచ ఉన్నట్లుగా తెలుస్తోంది.
DK Shivakumar : కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న ఫ్రీ బస్సు స్కీమ్ శక్తి పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలోచ ఉన్నట్లుగా తెలుస్తోంది. శక్తి స్కీమ్‌లో సాధ్యమయ్యే మార్పుల గురించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రయాణ ఖర్చులను సులభతరం చేసేందుకు పథకం ఉద్దేశించినప్పటికీ, కొంత మంది మహిళా ప్రయాణికులు తమ టిక్కెట్ల కోసం చెల్లించడానికి ప్రాధాన్యతనిచ్చారని శివకుమార్ (DK Shivakumar )చెప్పారు.
టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా, ఈ-మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారని తెలిపారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డితో చర్చిస్తానని శివకుమార్ వివరించారు.
KSRTC ప్రారంభమైనప్పుడు, మాకు 120 బస్సులు మాత్రమే ఉన్నాయి. నేడు మేము 24,282 బస్సులను నడుపుతున్నాము. మా హయాంలో 6,200 కొత్త బస్సులు ఇస్తామని హామీ ఇచ్చామని, ఇప్పటికే 3,400 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు డిప్యూటీ సీఎం. అంతేకాకుండా 9,000 కొత్త డ్రైవర్లు, కండక్టర్లను నియమించడం ప్రారంభించమని తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందస్తున్నామని తెలిపారు.



