మహిళలకు తెలంగాణ సర్కారు శుభవార్త..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రంలో మహిళలు సోలార్ ప్లాంట్లు నెలకొల్పితే నాలుగు ఎకరాల భూమి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు తగిన చర్యలను తీసుకోవాలని సంబంధితాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయం కానుంది. ఇందులో పది శాతం మహిళా సంఘాలు భరించనున్నాయి. మిగిలిన తొంబై శాతం బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారు. సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన ఆర్థికసాయాన్ని అందించేందుకు రుణాలివ్వడానికి బ్యాంకులు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతుంది.



