ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్ డేట్
పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం . ఈ పథకాన్ని వచ్చే నెల ఆగస్టు పదిహేను తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కూడా. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.
ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు గురించి మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ” ఏడాదిగా కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఫ్రీ బస్సు స్కీమ్ అగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తాము. ఈ పథకం ప్రారంభించిన కొత్తలో మహిళలకు కేవలం ప్రస్తుతానికి పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ బస్సుల్లోనే దీనిని ప్రారంభిస్తాం ‘ అని తెలిపారు.
మంత్రి రాం ప్రసాద్ రెడ్డి దీనిపై ఇంకా క్లారిటీ ఇస్తూ ‘ ప్రస్తుతానికి పల్లెవెలుగు, అల్ట్రా లగ్జరీ బస్సుల్లోనే అమలు చేయడానికి వెనక ఉన్న ప్రధాన కారణం మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించడానికే ‘ అని అన్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆటోడ్రైవర్లు సైతం నష్టపోకుండా వారికోసం కూడా కొత్త పథకాన్ని తీసుకొస్తాం’ అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నాం. ఐదేండ్ల వైసీపీ పాలనలో కుదేలు అయిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం అని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు.



