సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
పల్లవి, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆధిష్టానం చేసిన బుజ్జగింపులతో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ కూల్ గా ఉండటంతో ఈ వివాదానికి తెరతీసినట్లైంది. తాజాగా మరోక సారి డిప్యూటీ సీఎం డీకే తన మనసులో మాటను బయట పెట్టారు.
మీడియాతో ఆయన మాట్లాడుతున్న సమయంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ” తనకు సీఎం కావాలనే కోరిక అలాగే మిగిలి ఉంది. ఇందుకు గతంలో అనేక ప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు. కానీ ఇందుకు నేను బలంగా కోరుకున్నది, దాని కోసం చేసిన ప్రార్ధనలకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుందనే” ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవైపు ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదని అంటూనే ఇంకోవైపు రాష్ట్రానికి మంచి జరగాలి అంటూ తన ఆకాంక్షలను నేరుగా బయటపెట్టకుండానే ఆయన మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే తమకు జాతీయ అధ్యక్షుడని, ఆయన సూ చనల ప్రకారం పార్టీ కోసం పనిచేస్తామన్నారు.



