పవన్ కళ్యాణ్ కు డబ్బులిచ్చిన లోకేశ్

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. విజయవాడలోని సీఎం నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
అదే బస్సులో చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ ప్రయాణం చేశారు. ఆయనతో పాటు టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షులు మాధవ్, మంత్రి నారా లోకేశ్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాణించారు. మొదట సీఎం చంద్రబాబు నాయుడు మహిళా కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. ఇది తెలిశాక మంత్రి నారా లోకేశ్ ఆడబ్బులను వెనక్కి ఇప్పించారు.
ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బస్సులో ఎక్కి తన టికెట్ కోసం కండక్టర్ కు డబ్బులు చెల్లించబోయారు. ఆ సమయంలో మంత్రి నారా లోకేశ్ ఆగన్నా .. నా నియోజకవర్గంలో మీరు డబ్బులు చెప్పించడం ఏంటన్నా అని అన్నారు. అనంతరం తన టికెట్ డబ్బులతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులు మాధవ్ కు సంబంధించిన టిక్కెట్ డబ్బులను లోకేశ్ చెల్లించారు. ఇప్పుడు మీ చార్జీలకు నేను ఖర్చు చేసినందున మా నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకుంటానని మంత్రి లోకేశ్ సరదా వ్యాఖ్యలు చేశారు.