హీరోయిన్లకు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం..!
పల్లవి, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన కర్ణాటక సబ్బులు డిటర్జెంట్స్ లిమిటెడ్ మైసూర్ శాండిల్ అనే సబ్బులను తయారు చేస్తుంది.
అయితే, ఈ సబ్బులకు బ్రాండ్ అంబాసిడర్ గా మిల్క్ బ్యూటీ, హాటెస్ట్ హీరోయిన్ అయిన తమన్నా భాటీయాను ఎంపిక చేసింది కర్ణాటక ప్రభుత్వం. రెండు సంవత్సరాల కాంట్రాక్టు తో రూ.6.2 కోట్ల విలువైన ఈ ఒప్పందం కొనసాగనున్నది.
ఈ ఒప్పందంపై ఆ రాష్ట్రంలో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. గతంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక హీరోయిన్లు అయిన రష్మీక మందన్నా, శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్ లాంటి వాళ్లను ఆహ్వానిస్తే వారు రాలేదు.
ఇది మనసులో పెట్టుకుని స్థానిక హీరోయిన్లను పక్కనెట్టి బయట వాళ్లను ఎలా తీస్కుంటా రని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.



