నాచారం డీపీఎస్లో మ్యూజిక్ ఈవెంట్
 
                                
పల్లవి, హైదరాబాద్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్లో మెజ్జో ఫోర్టే మ్యూజిక్ ఈవెంట్ ఉత్సాహంగా సాగింది. ఈ ఈవెంట్లో 1 నుంచి11వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు తమ సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రతిభ చాటారు. భారతీయ పాశ్చాత్య సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ పదర్శించారు. ఈ కార్యక్రమానికి బీమ్లానాయక్ ఫేమ్ కిన్నెర మొగిలయ్య హాజరై విద్యార్థులకు కిన్నెర మ్యూజిక్ వినిపించారు. ఈ ఈవెంట్ కు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.



 
          



