నాచారం డీపీఎస్లో డాక్టర్స్ డే
పల్లవి, హైదరాబాద్: నాచారం డీపీఎస్ క్యాంపస్ లో నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ శిరీష ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన పోస్టర్లు రూపొందించారు. పండ్లు, కూరగాయలు తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్య పరీక్షల ప్రాముఖ్యత వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పిల్లలు వారి తోటివారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ప్రజారోగ్యంలో డాక్టర్ల పాత్ర గురించి వివరించారు.




