జిమ్ కు వెళ్లకుండా ఫిట్ గా ఉండాలా…?.

పల్లవి, వెబ్ డెస్క్ : బిజీబిజీ షెడ్యూల్ లో ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత వ్యాయామం అవసరమని అందరూ అంటుంటారు. ఉద్యోగం వల్లనో, ఇంట్లో పనుల వల్లనో వ్యాయామానికి సరైన సమయం కేటాయించడం కష్టమవుతుంది. ఈరోజుల్లో చాలా మంది ఫిట్ గా ఉండటానికి జిమ్ కెళ్లి మరి కసరత్తులు చేస్తారు. కానీ జిమ్ కు వెళ్లకుండా ఫిట్ గా కూడా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా ఎలా ఉండోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం
మీరు ఉండే అపార్ట్ మెంట్ , పని చేసే ఆఫీసుల వద్ద లిఫ్ట్ కనిపిస్తే వెంటనే లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కి వెళ్లడం వల్ల శరీర కండరాలు , ఎముకలు , కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె పనితీరు చక్కగా ఉంటుంది.ఉన్నపలంగా బరువు తగ్గాలి, వేగంగా బరువు తగ్గాలి అనుకునేవారికి స్కిప్పింగ్ చాలా మేలు చేస్తుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.
అదేవిధంగా కాలి కండరాలు కూడా బలంగా తయారవుతాయి. కానీ ఒకేసారి ఎక్కువ సమయం స్కిప్పింగ్ చేయకుండా క్రమం తప్పకుండా చేస్తూ స్కిప్పింగ్ టైం పెంచుకుంటూ పోవాలి.డాన్స్ కూడా శరీర బరువు తగ్గడానికి , గుండె ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తిడి నివారించడానికి సాయపడుతుంది. డాన్స్ వేయడం వలన కూడా శరీర కండరాలు కూడా కదులుతాయి.
వారాంతంలో ఏ మాత్రం అవకాశం ఉన్న ట్రెక్కింగ్ కు వెళ్లాలి. దీనివల్ల కేలరీలు ఖర్చు అయి శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అంతేకాదు ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది.