వర్షాకాలంలో దోమల కుట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రస్తుత వర్షాకాలంలో ఎక్కడ నీళ్లు నిల్వ ఉన్న అక్కడ దోమలు ప్రత్యేక్షమవ్వడం చూస్తుంటాము. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉన్న చోట నుంచి దోమలు కుట్టడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ముఖ్యంగా మలేరియా , డెంగ్యూ జ్వరాలు వస్తాయి. దోమల నుంచి కాపాడుకోవడానికి మస్కిటో రెపెల్లెంట్, మస్కిటో మ్యాట్ లను ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే, వీటిలో ఉండే రసాయానాల వల్ల కూడా అనారోగ్యానికి గురవుతారని వైద్యులు చెబుతుంటారు. మరి దోమల నివారణకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.
మూడు టెబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ని ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో వేసుకోని స్నానం చేయాలి. దోమ కాటు నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. దోమలు ఎక్కువగా ఒకవర్గానికి చెందిన వారినే ఎక్కువగా కుట్టడం చూస్తుంటాము. అందుకే వేపనూనెకి రెండు చుక్కల కొబ్బరినూనె చేర్చి ఒంటికి సాంబ్రాణి తీసుకుని పొగవేసి తలుపులు మూసేయాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఇంటిలోకి రావు.
కప్పు నీళ్లల్లో యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే , ఆ ఘాటుకు కూడా దోమలు పోతాయి. నాలుగు వెల్లుల్లిపాయలను దంచి దానికి కొంచెం కర్పూరం , కొంచెం ఏమైనా నూనె చేర్చి వెలిగిస్తే చాలు దోమల సమస్య నుంచి కాపాడుకోవచ్చు.