షుగర్ పేషెంట్లు ఇవి తింటే.. ఇక మెడిసిన్ అవసరమే ఉండదు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ అనేక రోగాల బారిన పడుతున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ అనేక రోగాల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. శారీరక శ్రమ లేకపోవడం.. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపే షుగర్ పేషెంట్లుగా మారుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు పలు రకాల మందులను తీసుకుంటున్నారు.
అయితే.. ఇది ఒక రోజులోనే తగ్గిపోయే వ్యాధి కాదు.. కానీ తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. దాంతో షుగర్ వ్యాధి(మధుమేహం) ప్రతికూల ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఇతర ప్రాణాంతక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. షుగర్ పేషెంట్లు కొన్ని రకాల ఫుడ్స్ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయని..దాంతో మెడిసిన్ వాడే అవసరం కూడా ఉండదని చెబుతున్నారు వైద్య నిపుణులు.. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం..
పాలకూర, తోటకూర, ఇతర ఆకుకూరల్లో చక్కర శాతం చాలా తక్కువగా.. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ C వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. అందుకే మధుమేహం ఉన్నవారికి ఇవి చాలా మంచివి. ఇవి శరీర కణాల్లో వాపు రాకుండా కాపాడతాయి.
ఇక, ఫ్యాటీ ఫిష్ ని షుగర్ పేషెంట్లు తింటే చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.. మధుమేహం ఉన్నవారికి ఇన్ఫ్లమేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఫ్యాటీ ఫిష్ తింటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అలాగే.. హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే బాదం, అక్రోట్ వంటి గింజలను తరుచుగా తీసుకోవడం మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచటంతోపాటు ఆహారంలోని పిండి పదార్థాలు శరీరంలో నెమ్మదిగా అబ్జార్బ్ అయ్యేలా చేస్తాయి.
తృణధాన్యాలను వీలైనంత ఎక్కువగా షుగర్ పేషెంట్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వివిధ రకాల తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే.. ఆహారంలోని పిండి పదార్థాలు శరీరానికి నెమ్మదిగా అందుతాయి.. దాంతో రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
అలాగే..బీన్స్, మినుములు, శనగలు వంటి పప్పు ధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయని.. వీటిని తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవి షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంచుతాయి.. అంతేకాకుండా, ఇవి తిన్న తర్వాత మనకు ఎక్కువ సేపు ఆకలి వేయదు.
చియా సీడ్స్ కూడా షుగర్ పేషెంట్స్ ఆహారంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి డైజెస్ట్ అయ్యే వేగాన్ని తగ్గించి, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగకుండా నియంత్రిస్తాయి. ఈ ఫుడ్స్ తినడంతో పాటు రోజూ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండాలని.. అలాగే, నీళ్లు కూడా ఎక్కువగా తాగాలని.. అప్పుడే మధుమేహాన్ని కంట్రోల్ చేయోచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.