బాదం పప్పు నానబెట్టి తింటే ఎక్కువ లాభమా..?

పల్లవి, వెబ్ డెస్క్ : బాదం పప్పు, కిస్ మిస్ , వాల్ నట్స్ లను చాలా మంది నేరుగా తినేస్తుంటారు. కానీ వీటిని పచ్చిగా తినే బదులు కొన్ని గంటలు నానబెట్టి తింటే వీటిలో ఉండే పోషకాలు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్యనిపుణూలు. బాదం పప్పుల్ని నానబెట్టడం వల ఫ్లైటికామ్లం అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది.
కిస్ మిస్ లను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని తెల్లారే ఉదయం తినడం వల్ల వాటిలో ఉంటే ఐరన్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు స్థాయులు రెట్టింపు అవుతాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. సబ్జా గింజలను సైతం నానబెట్టి తింటే సబ్జా గింజల్లో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్రొటీన్ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సబ్జా గింజలు సాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్ ని ఓ గంట పాటు నానబెట్టి తీసుకుంటే ఓట్స్ యొక్క రుచి పెరగడంతో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది అని వారు సూచిస్తున్నారు. పప్పుల్ని వండే ముందు నానబెడితే వండే సమయం తగ్గడంతో పాటు త్వరగా జీర్ణమవుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..