జరీ ఓరిజినలా, డూప్లికేటా అని ఎలా గుర్తించాలి?

పల్లవి, వెబ్ డెస్క్ : పట్టు వస్త్రాలంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఎమోషన్. పెళ్లీళ్లైనా, బర్త్ వేడుకలైన ఇష్టమైన రకరకాల దుస్తులను ధరిస్తారు. కొన్నింటిని మెమరీస్ గా దాచుకుంటారు కూడా. అయితే, మెరిసేదంతా బంగారం కాదన్నట్లు, పట్టు పేరుతో అమ్మేదంతా స్వఛ్చమైనది కాదు. అచ్చమైన జరీ అంచుల్ని తలపించే విధంగా వాటి పోలికలతో ఎన్నో రకాల దుస్తులు మార్కెట్ లో కన్పిస్తాయి.. మరి అలాంటప్పుడు నిజమైన జరీని గుర్తు పట్టడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యూర్ జరీని రాగితో ఎలక్ట్రోప్లేట్ చేసిన పట్టు దారాలను ఉపయోగించి చేస్తారు. ఆపై వెండితో చుట్టి బంగారు పూతతో పూర్తి చేస్తారు. అయితే, దీనికి విరుద్ధంగా టెస్టెడ్ జరీ అనుకరణలు, కౌకైన లోహాల చుట్టూ ప్లాస్టిక్ , ల్యూరెక్స్ వంటిని ఉపయోగించి చేస్తారు. దూరం నుంచి చూస్తే ఆ మెరుపు మాయ చేస్తాది.
కానీ ఇవి ఎక్కువకాలం మన్నిక ఉండదు. ఇక నిజమైన ప్యూర్ జరీ సాప్ట్ గా వార్మ్ గ్లోతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. కానీ, సింథటిక్ జరీ ఎక్కువ మెరుపుతో , మెటాలిక్ లుక్ తో మెరిసిపోతుంది. కృత్రిమ రకాలతో పోలిస్తే స్వచ్చమైన జరీ బరువుగా ఉంటుంది. పైగా ఇది గట్టిగా నేసి ఉంటుంది. ఫ్యాబ్రిక్ వెనుకభాగం వదులుగా గజిబిజిగా ఉంటే అది స్వచ్చమైన జరీ కాదని గుర్తించాలి. ఈ విధంగా నిజమైన జరీ ఏదో డూప్లికేట్ జరీ ఏదో గుర్తించాలి.