దోశను అలా తింటే ఆరోగ్యమే… ఆరోగ్యం..!

పల్లవి, వెబ్ డెస్క్ : నార్త్ ఇండియన్ అయినా, సౌత్ ఇండియన్ అయినా అల్పహారం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేవాటిలో మొదటిది ఇడ్లీ.. రెండోది దోశ. దోశ సాధారణంగా బియ్యం, మినపప్పుతో తయారయ్యే దోశ పిండిలో ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ లోపాన్ని సరిదిద్ది దోశను మరింత ఆరోగ్యకరంగా మార్చడానికి ఐదు రకాల అధిక ప్రోటీన్ పదార్ధాలను దోశపిండిలో చేర్చవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దోశ పిండికి అధిక ప్రోటీన్స్ ఇలా జోడించాలి.
దోశ అంటే బియ్యపు పిండినే వాడతారు. కానీ బియ్యం బదులు పెసలను అదే పరిణామంలో కలపవచ్చు. వంద గ్రాముల పెసలలో సుమారు ఇరవై నాలుగు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తిన్నాక సులభంగా జీర్ణమవుతుంది. అరకప్పు క్వినోవాను నానబెట్టి దోశ పిండితో కలిపి రుబ్బుకుని ఆ తర్వాత ఆ పిండిని పులియబెట్టాలి. వంద గ్రాముల క్వినోవాలో దాదాపు పద్నాలుగు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. ఇది తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో కూడిన ప్రీటీన్ కు మూలం.
దోశపిండి కోసం సోయాబీన్స్ ను నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టి మెత్తని పేస్ట్ గా చేసి సాధారణ దోశ పిండిలో కలపాలి. వంద గ్రాముల ఎండు సోయాబీన్ లో సుమారు ముప్పై ఆరు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. దోశ వేయడానికి ముందు రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపిండిని పులిసిన దోశ పిండిలో కలపాలి. వంద గ్రాముల శనగపిందిలో ఇరవై నుంచి ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
దోశ వేయడానికి ముందు రాజ్ గిరానును రాత్రంతా నానబెట్టి ఇతర ధాన్యాలతో కలిపి రుబ్బుకోవచ్చు. లేదా పిండి రూపంలో పులియబెట్టే ముందు దోశ పిండిలో కలపవచ్చు. వందగ్రాముల ఎండు రాజ్ గిరా లో దాదాపు పదమూడు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. ఇది గ్లూటెన్ -ఫ్రీ కాల్షియం , ఐరన్ ఎక్కువగా ఉంటుంది.