కొబ్బరి నీళ్లు అందరికీ మంచిది కాదా…?

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రకృతి సహజంగా అందించే మంచి ఔషధం. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే కొబ్బరి నీరు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వేసవి కాలం వస్తే చాలు కొబ్బరి నీళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో ఎక్కువగా లభ్యమయ్యేది కొబ్బరి కాయలు. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో శరీరాన్ని హైడ్రెట్ చేయడంలో కొబ్బరి నీరు సహాయపడుతుంది. అదోక్కటే కాకుండా కొబ్బరి నీరు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను తొలగించడం , చర్మం ఆరోగ్యంగా ఉంచడం , జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
అయితే , కొబ్బరి నీరు అందరికీ ఉపయోగకరం కాదంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు కొబ్బరి నీళ్లను తీసుకోకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలున్న వారు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల హానికర ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వారు సూచిస్తున్నారు. మరి ఏ అనారోగ్య సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లు తాగకకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిది. దీంట్లో ఉండే పోటాషియం స్థాయి ఎక్కువగా ఉండటంతో కిడ్నీ రోగుల శరీరంలో పోటాషియం నిల్వ ఉండే ప్రమాదం ఉంటుంది. ఇది హైపర్ కలేమియా అనే సమస్యకు దారి తీస్తుంది. ఇది గుండెకు చాలా ప్రమాదకరం.
డయాబెటిస్ సమస్యలున్న వారు సైతం కొబ్బతి నీళ్లను చాలా జాగ్రత్తగా , పరిమితంగా వైద్యుల సూచనలతో తీసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి నీళ్లు సహాజంగానే తీపి గల పానీయం. అందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు కార్పోహైడ్రెట్లతో రక్తంలోని షుగర్ లెవల్స్ పెంచే ప్రమాదం లేకపోలేదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. వృద్ధులు, హైబీపీ ఉన్నవారు కొబ్బరి నీళ్లను అధికంగా తీసుకుంటే రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా చర్మం మీద అలర్జీ, ఎరుపు వంటి ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇదే అంశమ్మ్ గురించి ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యూట్రిస్ట్ డా. రంజన్ సింగ్ కూడా ధృవీకరిస్తూ ‘ కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమైన పానీయం కానీ అది అందరికీ కాదు. ముఖ్యంగా కిడ్నీ, డయాబెటిక్, హైబీపీ ఉన్నవారు వీటిని తీసుకునేముందు సంబంధిత డాక్టర్లను సంప్రదించాలని ‘ ఆయన తెలిపారు. అయినా ఏ పానీయం అయినా ఆహార పదార్థమైన పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యం. పరిమితులు దాటితే అనారోగ్యంగా మారుతుంది.