‘టీ’ లో యాలకులు వేస్తున్నారా..?

పల్లవి, వెబ్ డెస్క్ : చాలా మందికి టీ లేదా కాఫీ తాగంది రోజు మొదలు కాదు. ఉదయం లేవగానే టీ నో కాఫీనో తాగకపోతే ఆ రోజు ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతారు. కొంతమంది తాము తీసుకునే టీ లో, కాఫీలో అల్లం, యాలకులు ఇలా ఏదోకటి వేసుకుని తాగుతారు.
అయితే, యాలకులు వేసిన టీ తాగడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ‘టీ రుచి పెరగడంతో పాటు కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
జీర్ణవ్యవస్థ కండరాలు సడలించడానికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. అలాగే మెటబాలిజం రేటు కూడా పెరిగి బరువు తగ్గాలనుకునేవారికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.