X trending: బైకాట్ NETFLIX ఎందుకంటే?

పల్లవి, వెబ్ డెస్క్: ట్విటర్ లో బైకాట్ నెటిఫ్లిక్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది. నెటిజన్లు ఈ ఓటీటీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వెబ్ సిరీస్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ చిక్కుల్లో పడింది. 176 మంది ప్రయాణికులతో కాఠ్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో చూపిన ఉగ్రవాదుల పేర్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్ ’ ఆధారంగా అనుభవ్ సిన్హా ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు. 176 మంది ప్రయాణికులతో కాఠ్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్ తీసుకెళ్లమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబూల్ ఎలా చేరింది? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు? వారు చేసిన డిమాండ్లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఏ సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది? అన్నది సిరీస్. ఇక్కడి వరకు ఇదంతా బాగానే ఉన్నా.. నాడు కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల పేర్లు..
1.- ఇబ్రహీం అక్తర్
– 2. షాహిద్ అక్తర్
– 3. సన్నీ అహ్మద్
– 4. జహూర్ మిస్త్రీ
– 5. షకీర్
కానీ అనుభవ్ సిన్హా నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’లో హైజాకర్లను-‘ భోలా- శంకర్’ అనే హిందువుల పేర్లతో చూపాడని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ వర్గాలతోపాటు సాధారణ నెటిజన్లు కూడా అటు అనుభవ్ సిన్హాను, ఇటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. వెబ్ సిరీస్‌ల పేరుతో హిందువుల పరువు తీయడం ఆపండి అంటూ మండి పడుతున్నారు.