Bigg Boss 8 Promo: భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న.. బిగ్ బాస్–8 కొత్త ప్రోమో
బిగ్ బాస్ షోకు తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతమయ్యాయి. ఇప్పుడు.. బిగ్ బాస్(Bigg boss) కొత్త సీజన్ కోసం తెలుగు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 లోగోను అధికారికంగా విడుదల చేశారు మేకర్స్. ఈ కొత్త సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. తాజాగా సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
‘ఈసారి బిగ్‌బాస్ సీజన్-8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు’ అంటూ.. సీజన్ 8పై నాగార్జున హైప్ క్రియేట్ చేశారు. ‘ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంకండి’ అంటూ విడుదల చేసిన ప్రోమో అలరిస్తోంది.
కాగా.. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు, ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి, కొత్త ఎలిమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయా.. ఇలా చాలా అంశాల గురించి ఇప్పటినుండి సెర్చింగ్ మొదలుపెట్టేశారు. ఈ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది.



