ఇండియన్ ఆర్మీపై పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు..!

ఇండియన్ ఆర్మీపై పాకిస్థాన్ జట్టుకు చెందిన మాజీ ఆటగాడు షాహీద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాది దాడి గురించి మాట్లాడుతూ ఇండియాలో పటాకులు పేలిన కానీ వెంటనే వారు పాకిస్థాన్ వైపు చూపిస్తారు. తమ వైపల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమపై నిందలు వేస్తారు.
కశ్మీర్ లో ఎనిమిది లక్షల మంది సైన్యం ఉందని భారత్ గొప్పలు చెప్పుకుంటుంది. అంత గొప్ప సైన్యం ఉన్నప్పుడు పర్యాటకులపై దాడి ఎలా జరిగింది. దీనర్ధం భారత్ ఆర్మీ గొప్పది కాదా..?. వారు సమర్ధవంతమైన వాళ్లు కాదా అని ప్రశ్నించారు.
పహాల్ గామ్ లో ఉగ్రవాదులు దాడి జరిపిన తక్షణమే వెనక ముందు ఆలోచించకుండా విద్యావంతులైన అన్ని తెల్సిన టీమిండియా ఆటగాళ్లు సైతం తమ దేశం గురించి వ్యాఖ్యానించారని ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్రిది తరచుగా భారత్ పై అవాకులు చవాకులు పేలుస్తూ వార్తల్లో నిలవడం మనం చూస్తూనే ఉంటున్నాము.