అంబేద్కర్‌కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య నివాళులు
అంబేద్కర్ జయంతి సందర్బంగా బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ హత్య చేసిందని..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఘోరి కట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన రాజ్యాంగం చెక్కు చెదరలేదని.. అది అంబేద్కర్, దేశ ప్రజలు గొప్పతనమని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతుందని, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేలా చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక అంబేద్కర్‌తో అనుబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్ది.. పంచ తీర్ధగా అభివృద్ధిగా చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
Related News
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
బరువు తగ్గాలనుకునేవాళ్లకు శుభవార్త..!
-
గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య



